తెలంగాణాలో టెన్త్, ఇంటర్ ఫలితాల తేదీలు ఎప్పుడంటే?
తెలంగాణాలోని పదవతరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమయ్యింది. మే 10వ తేదీన ఇంటర్ ఫలితాలు, మే 15న టెన్త్ ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మూల్యాంకనం జరుగుతోంది. అతి తొందరలోనే ఈప్రక్రియ పూర్తి చేసి, టాబ్యులేషన్ పూర్తి చేసి ఫలితాలు డిక్లేర్ చేయనున్నారు. కానీ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు టెన్త్ రిజల్ట్ రాకముందే ఎడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటున్నాయి.

