తెలంగాణా అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని తెలంగాణా అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కాగా అసెంబ్లీ ముట్టడికి సమగ్ర శిక్ష ఉద్యోగులు యత్నించారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. వారు అసెంబ్లీ ముందు ధర్నా చేపట్టారు.కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినంట్ చేస్తామని మాట ఇచ్చి తప్పిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో పోలీసులు ఉద్యోగులను అడ్డుకునే ప్రయత్నం చేసి వారిని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.