Home Page SliderTelangana

మెదక్ జిల్లాలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అరెస్ట్..

లగచర్ల తరహాలో మెదక్ జిల్లాలో మరో ప్రజా ఉద్యమం మొదలైంది. జిల్లాలోని గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజల నిరసన తెలిపారు. గ్రామస్థులకు నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరసనకారులకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి తమ ఇంట్లో వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్లారోనని మహిళలు ఆవేదన చెందుతున్నారు.