బాసర ట్రిపుల్ ఐటీలో చెలరేగిన ఉద్రిక్తత
బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణం మరోమారు ఉద్రిక్తతలకు వేదికయ్యింది. బీజేపీ మహిళా మోర్చా, బీజేపీ కార్యకర్తలు అక్కడ జరిగిన విద్యార్థినుల వరుస ఆత్మహత్యలతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తగాదా, తోపుడు చోటుచేసుకుంది. బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలు గీతామూర్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఆందోళన కారులను చెదరగొట్టడానికి ప్రయత్నించారు పోలీసులు. పరిస్థితిని అదుపు చేయడానికి కృషి చేస్తున్నారు. గత వారం ఇద్దరు పీయూసీ విద్యార్థినులు రెండురోజుల తేడాతో ఈ ప్రదేశంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. +