పెళ్లి వేడుకలో ఉద్రిక్తత.. కత్తులతో దాడులు
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మడిపల్లిలో పెళ్లి వేడుకలో ఉద్రిక్తత నెలకొంది. డ్యాన్స్ విషయంలో రెండు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకోగా అన్వేశ్, రమేశ్ అనే ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరువర్గాల ఘర్షణకు భూ తగాదాలే కారణమని తెలుస్తోంది.

