Andhra PradeshHome Page Slider

కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్ల వద్ద ఉద్రిక్తత

ఏపీలో ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. కాగా టీడీపీ కార్యకర్తలు గుడివాడలోని కొడాలి నాని,గన్నవరంలోని వల్లభనేని వంశీ ఇళ్లపై రాళ్లు,కోడిగుడ్లతో దాడి చేశారు. అంతేకాకుండా వారు వల్లభనేని వంశీ అపార్ట్‌మెంట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.  ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.