హైదరాబాద్ సచివాలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు బీసీ జనసభ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు నిరుద్యోగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పోలీసులు,నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల ముట్టడిని కట్టడి చేసేందుకు పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.