బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ పోలీసులు భారీగా మొహరించారు. బుధవారం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హడావుడి చేశారు. తన ఫిర్యాదును తీసుకోవాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనితో నేటి ఉదయం ఆయన ఇంటివద్ద చేరుకున్నారు. ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. దీనితో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.