Andhra PradeshHome Page Slider

అచ్యుతాపురం సెజ్ వద్ద ఉద్రిక్తత- కోటిరూపాయలివ్వాలని డిమాండ్

శుక్రవారం జరిగిన అచ్యుతాపురం సెజ్ సాహితీ ఫార్మాలో అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన, గాయపడిన వారి బంధువులు, కుటుంబసభ్యులు అచ్యుతాపురం సెజ్ వద్ద ఆందోళనలు చేపట్టారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆదుకోవాలని, కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు కంపెనీల నిర్లక్ష్యమే కారణమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ఛీప్ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు. ఆయా కంపెనీలపై సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాలని, సరైన రక్షణ చర్యలు కార్మికలకు, ఉద్యోగులకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.