కుమార్తెకు బాధ్యతలు అప్పగించిన టెండూల్కర్
తన కుమార్తె సారా టెండూల్కర్‌కు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సచిన్ ట్వీట్ చేశారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ఇండియా డైరక్టర్‌గా సారా బాధ్యతలు నిర్వహించబోతోందని పేర్కొన్నారు. ఇటీవలే లండన్‌లోని క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ విభాగంలో సారా మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. భారత్‌లో క్రీడా, ఆరోగ్య, విద్యారంగంలో సాధికారతకు కృషి చేస్తుందని సచిన్ పేర్కొన్నారు. 27 ఏళ్ల సారా, సచిన్, డాక్టర్ అంజలిల తొలి సంతానం. ఆమె తమ్ముడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్‌లో రాణిస్తున్నారు.

