ఎయిర్ పోర్ట్ మెట్రో కోసం టెండర్లు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంత రద్దీగా ఉంటుందో మనకు తెలుసు. దేశ, విదేశీ ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అందుకే ఈ ఎయిర్ పోర్టుకు కూడా మెట్రో ట్రైన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆలోచించింది. దానికోసం టెండర్లు పిలవబోతోంది. దీనికి నోటిఫికేషన్ జారీ చేసింది. రేపటి నుండి బిడ్డింగ్ పత్రాలను హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ జారీ చేయనుంది. జూలై 5వ తేదీ వరకు బిడ్డింగుకు వేసుకోవచ్చు. ఈ మెట్రో కాంట్రాక్టు విలువ 5,688 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మెట్రో ట్రైన్ ద్వారా ట్రాఫిక్ లేకుండా వేగంగా ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు.