Andhra PradeshHome Page Slider

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో ప్రలోభాల పర్వం

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు 2 నుండి 3 వేల రూపాయలు అందజేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి డబ్బుల పంచుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బులు పంచుతున్నారు. మున్సిపల్ కళ్యాణ మండపంలో ఓటర్ లిస్టులోని పేర్లు ఆధారంగా ఓటరుకు 3000 రూపాయలు అందజేస్తున్నారు. పేరాబత్తుల రాజశేఖర్ తరపున సకుమళ్ళ గంగాధర్ డబ్బులు పంపిణి చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.