‘కేఎఫ్‌సీ’కి బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు హీరో
ప్రముఖ ఆహార వ్యాపార సంస్థ కేఎఫ్‌సీకి అంబాసిడర్‌గా యంగ్ తెలుగు హీరోను ఎంపిక చేశారు. ఆయనెవరో కాదు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవలే దీనికి సంబంధించిన ఫోటో షూట్‌లను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు విజయ్. హాట్ ఎయిర్ బెలూన్‌లో ‘కేఎఫ్‌సీ’ ఫుడ్ తింటూ ఫోటోలలో కనిపించారు. ‘ఈ ఫుడ్ టేస్ట్ కోసం ఎంతదూరమైనా వెళ్తా…స్కై ఈజ్ ది లిమిట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


