Home Page SliderSports

టాప్ 3లో తెలుగు క్రికెటర్

టీమిండియాకు చెందిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డు సాధించారు. ఒక్కసారిగా ఐసీసీ ర్యాంకింగ్‌లో 69 స్థానాలు ఎగబాకి టాప్ 3 స్థానంలో నిలిచారు. అరంగేట్రం చేసిన అనంతరం కేవలం 20 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించిన యువ క్రికెటర్‌గా తిలక్ వర్మ నిలిచారు. ఇటీవల సౌతాఫ్రికాపై వరుస సెంచరీలతో దుమ్ము రేపిన ఈ యువ కిశోరం 51.33 సగటుతో 616 రన్స్ చేశారు. టాప్ 1లో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ ఉండగా, ఇంగ్లాండ్‌కు చెందిన సాల్డ్ రెండవ స్థానంలో ఉన్నారు. మూడవ స్థానంలో భారత్ క్రికెటర్ ఉండడంతో అభిమానులు సంబర పడుతున్నారు.