ఏ జెండా ఎగరాలో మీరే చెప్పండి-బండి సంజయ్
కరీంనగర్: కరీంనగర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ భూకబ్జాలు, అవినీతి, ఇసుక కుప్పలు కనిపిస్తే డబ్బులు వసూలు లాంటివి చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. పొరపాటున ఆ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా ప్రజలను పీల్చి పిప్పి చేయడం ఖాయమన్నారు. కరీంనగర్ గడ్డపై ఏ జెండా ఎగరాలో మీరే చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్‌లోని కాలనీల్లో కలియ తిరిగి ప్రచారం చేశారు. సంజయ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు బ్యాంకుగా మారి కమలం గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గంగులకు మూడుసార్లు ఓట్లు వేస్తే ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నారా? దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల కోసం పోరాడానన్నారు. ఓటును సొమ్ములతో గంగుల కొంటానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.