Home Page SliderTelangana

ఏసీబీకి చిక్కిన తెలంగాణా యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా

తెలంగాణా యూనివర్సిటీ, నిజామాబాద్‌లో వైస్ ఛాన్స్‌లర్ రవీందర్ గుప్తా గుట్టు రట్టయ్యింది. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు వీసీ. భీమ్‌గల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు లంచం అడిగారు ఆయన. దీనితో ఏసీబీ అధికారులు వలపన్నారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. విజిలెన్స్ దాడులలో పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయి. వర్సిటీ నియామకాలు, నిధులపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఆయన వీసీగా నియామకం అయిన నాటి నుండి ఆయనపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 100 కిపైగా అక్రమ ఉద్యోగాలు సృష్టించి, భారీగా వసూలు చేశారని ఫిర్యాదులు ఉన్నాయి. దీనితో ఉన్నత విద్యాశాఖ అధికారి నవీన్ మిట్టల్‌పై కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దీనితో వర్సిటీ నియామకాలపై ఏసీబీ విచారణ చేపట్టింది.