సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ స్కాలర్స్
తెలంగాణ నుంచి UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రజా ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వారిలో 20 మంది అభ్యర్థులు ఎంపిక కావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు.సింగరేణి సంస్థ సహకారంతో ప్రభుత్వం తెలంగాణ నుంచి ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులై మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిలో అర్హులైన 135 మందికి గత ఆగస్టు నెలలో రాజీవ్ సివిల్స్ అభయ హస్తం కింద ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. వారిలో 20 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత సాధించడం విశేషం