తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ..
మరో రెండు, మూడు వారాలలో టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఒక్క బస్సు కూడా కోనుగోలు చేయలేదని.. ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు. సంస్థను నష్టాల్లోకి నెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు. భారీగా ఉద్యోగాల భర్తీ, పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులో తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తొలిదశలో 3,035 ఉద్యోగాల భర్తీ చేసేందుకు నిర్ణయించగా.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమోదం తెలిపారన్నారు.

