ప్రపంచసుందరి ‘గ్రాండ్ ఫినాలే’ వీడియో విడుదల
విశ్వనగరం హైదరాబాద్‌ను 20 రోజులుగా అలరిస్తున్న ప్రపంచసుందరి పోటీలలో నేడు ఆఖరి ఘట్టం సమీపించింది. నేడు సాయంత్రం గ్రాండ్‌గా గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వీడియోను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ అందంగా ముస్తాబయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 120 మంది సుందరీమణులు ప్రపంచసుందరి పోటీలతో పాటు, తెలంగాణలోని పలు ప్రసిద్ధ ప్రాంతాలు దర్శించి, ప్రపంచానికి ‘తెలంగాణ జరూర్ ఆనా’ అంటూ తెలంగాణ టూరిజంను ప్రమోట్ చేశారు.

