NationalNewsTelangana

ఢిల్లీ లిక్కర్ అమ్మకాల్లో తెలంగాణ రాజకీయ నేతలు

ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాంలో అనుహ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్‌లో తెలంగాణకు చెందిన వ్యాపారుల, రాజకీయ నేతల హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది. ఢిల్లీ లిక్కర్ దుకాణాల్లో రాష్ట్రానికి చెందిన 10 మంది వ్యాపారులకు వాటాలుండగా , వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు భాగస్వామ్యం కావడంతో రాజకీయ హీట్‌ను పెంచింది. ఇటువంటి వ్యాపారాలు చేసే రాజకీయ నేతలు ఢీల్లీలో ఏకంగా దుకాణాలను దక్కించుకోవడం ఓ ఎత్తు అయితే , ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో తెలంగాణాకు చెందిన నేతలు , వ్యాపారవేత్తలు డీల్ కుదుర్చుకున్నారనే వార్లుత కూడా వెలుగుచుస్తున్నాయి. లిక్కర్‌కు సంబంధించిన డీల్స్ అన్ని హైదరాబాద్‌లోని హోటళ్లలోనే జరిగాయని బీజేపీ కూడా ఆరోపించింది. ఇదిలా ఉండగా ఏడు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి సీబీఐ తనిఖీలు నిర్వహించగా.. కోకాపేటలోని ప్రముఖ లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లె ఇంట్లో కూడా సోదాలు జరిపినట్లు సీబీఐ ప్రకటించింది.

గత ఏడాది నుండి ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ అమ్మకాల బాధ్యతలకు స్వస్తి పలికి కొత్త పాలసీని ఏర్పాటు చేసింది. పాత పద్దతి ప్రకారం కాకుండా , కొత్తగా జోనల్ ప్రక్రియ ప్రారంభించింది. దీని ద్వారా ఒక జోన్ టెండర్ దక్కించుకున్నవారు ఒక దుకాణం మాత్రమే కాకుండా , ఆ జోన్ పరిధిలో ఎన్ని వైన్ షాపులైనా ఏర్పాటు చేసుకునే వీలు కల్పించింది. మద్యం వ్యాపారం నుండి ప్రభుత్వం తప్పుకోవడంతో ప్రైవేటు వ్యాపారులకు రెక్కలోచ్చినట్టయింది. ఇదే అవకాశంగా అనుకున్న ప్రైవేటు వ్యాపారులు కస్టమర్స్‌కి డిస్కాంట్‌లు , వన్ ప్లస్ వన్ ఆఫర్స్ , ఎమ్‌ఆర్‌పీ ధర కంటే తక్కువకు అమ్మడం మొదలు పెట్టారు. దీంతో ఢిల్లీలో మద్యం సేల్స్ భారీగా పెరిగాయి. ఈ కొత్త పద్దతి ద్వారా  చాలా పెద్ద మెత్తంలో డబ్బులు చేతులు మారినట్టు.. అక్రమ దందాలో ప్రభుత్వ పెద్దలకు రూ.144 కోట్లు అందాయని లిఖితపూర్వకంగా బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మద్యం అమ్మకాలలో బీజేపీ చేస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చెపట్టింది. జోనల్ పద్దతిని రద్దు చేస్తూ.. పాత పద్దతిలోనే మద్యం విక్రయాలు జరపాలని నిర్ణయించింది. ఈ నెల 1 నుండి మళ్లీ పాత పద్ధతిలో అమ్మకాలను కొనసాగిస్తుంది.