బండి సంజయ్ ఏ-1 గా బుక్ చేసిన పోలీసులు
పదో తరగతి పేపర్ లీకేజి కేసులో అరెస్టు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఏ-1గా బుక్ చేశారు పోలీసులు. ఏ-2గా ఆయనకు వాట్సాప్‌లో పేపర్‌ను పంపిన ప్రశాంత్‌ను, ఏ-3 గా మహేశ్, ఏ-4 గా శివగణేష్‌ను చూపించారు. బండి సంజయ్‌ను హనుమకొండ కోర్టులో హాజరు పరచారు. కానీ సెలవు కారణంగా మెజిస్ట్రేట్ కోర్టుకు రాలేదు. దీనితో బండిని మెజిస్ట్రేట్ ఇంటికే తీసుకెళ్లాలనుకున్నారు. కానీ పోలీసులకు అనుమతి లభించలేదు. బండి సంజయ్‌కు బెయిల్ లభిస్తుందా లేదా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

