పాదయాత్రలో అలజడి, షర్మిల అరెస్టు
టీఆర్ఎస్ కార్యకర్తలతో ఘర్షణ నేపథ్యంలో వైఎస్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తోన్నట్టు తెలుస్తోంది. శాంతి భద్రతల దృష్ట్యా షర్మిలను పోలీసలు అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. ప్రజలపక్షాన పోరాడుతున్న తనను అరెస్ట్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు షర్మిల. పోలీసులను పనివాళ్లలా వాడుకుంటూ.. టీఆర్ఎస్ గూండాలను ఉసిగొల్పుతున్నారంటూ ఆమె మండిపడ్డారు. బస్సులు తగలబెడుతూ, దాడులకు పాల్పడుతున్నారని… ఇది ప్రజాస్వామ్యమా? తాలిబన్ల రాజ్యమా? అంటూ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలో భాగంగానే పాదయాత్రలో బస్సును తగలబెట్టారన్నారు. అన్ని పర్మిషన్లు తీసుకుని పాదయాత్ర చేస్తున్నా.. శాంతిభద్రతల సమస్య సృష్టించి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలో భాగంగానే పాదయాత్రలో బస్సును తగలబెట్టారు. అన్ని పర్మిషన్లు తీసుకుని పాదయాత్ర చేస్తున్నా.. శాంతిభద్రతల సమస్య సృష్టించి నన్ను అరెస్ట్ చేయాలని, పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. పోలీసులను పనోళ్లలా వాడుకుని దాడులు చేస్తున్నారు.
1/2 pic.twitter.com/bCSV4nGjdR— YS Sharmila (@realyssharmila) November 28, 2022
పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. పోలీసులను పనోళ్లలా వాడుకుని దాడులు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. మిగతా అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తుంటే, ప్రజల పక్షాన పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ అన్నారు షర్మిల. రేయింబవళ్లు కొట్లాడుతుంటే ఓర్వలేక పిరికిపందల్లా అరెస్ట్ చేసి… టీఆర్ఎస్ గూండాలు కుట్రలు పన్నుతున్నారన్నారు.
https://t.co/qogJyIbl8x
ప్రజలపక్షాన పోరాడుతున్న నన్ను అరెస్ట్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. పోలీసులను పనివాళ్లలా వాడుకుంటూ.. టీఆర్ఎస్ గూండాలను ఉసిగొల్పుతోంది. బస్సులు తగలబెడుతూ, దాడులకు పాల్పడుతోంది. ఇది ప్రజాస్వామ్యమా? తాలిబన్ల రాజ్యమా?#Narsampet— YS Sharmila (@realyssharmila) November 28, 2022
షర్మిలపై హత్యాయత్నం జరిగిందన్నారు గట్టు రామచంద్రరావు. ఆడబిడ్డపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాడి చేయడం హేయమన్నారు. షర్మిల పాదయాత్రతో టీఆర్ఎస్ వెన్నులో వణుకుపుడుతోందన్నారు మరో నేత కొండా రాఘవరెడ్డి. రాష్ట్రమంతటా షర్మిలకు ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు.