Home Page SliderTelangana

విడుదలైన తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు

పీజీ కాలేజీలలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల కోసం ప్రవేశ పరీక్ష పీజీఈసెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు జూన్ 10 నుండి 13 వరకూ జరిగాయి. నాలుగురోజులు గడవకముందే ఫలితాలు విడుదలవడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 20,626 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీటిని జేఎన్‌టీయూహెచ్ నిర్వహించింది. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేశారు.