Andhra PradeshHome Page SliderNews Alert

విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రి

తెలంగాణ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు గురువారం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠ ప్రాంగణంలోని దేవతా మూర్తుల ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.