తెలంగాణ మంత్రితో మాజీ ఎంపీ కనుమూరి మంతనాలు
మాజీ ఎంపీ, టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజుతో భేటీ అయ్యారు తెలంగాణ సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్. తిరుమల స్వామి దర్శనానికి వచ్చిన ఇద్దరు నేతలు తాజా రాజకీయాలపై చర్చించుకున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఆలోచనలపై మంత్రి ఈశ్వర్, కనుమూరికి వివరించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ విషయంలో కేసీఆర్ ఆలోచనలను కనుమూరికి వివరించారు కొప్పుల. ఏపీలోనూ బీఆర్ఎస్ ప్రభావం చూపెడుతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గత కొంత కాలంగా రాకీయాలకు దూరంగా ఉన్న నేతలపై గులాబీ పార్టీ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత బాపిరాజు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా బాపిరాజుకు డిపాజిట్ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ పాతకాపులను బీఆర్ఎస్ పార్టీలోకి లాగాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.


