కేటీఆర్, హరీష్ నా కాలి గోటికి సరిపోరు..
కేటీఆర్ ఒక బచ్చాగాడని, ఆయన దగ్గర్ రేస్ ఉంది.. దోచుకున్న సొమ్ము ఉందన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అమెరికాలో చదువుకున్న కేటీఆర్.. వాడు, వీడు అని మాట్లాడుతున్నాడన్నారు. ‘నాకూ తిట్లు వచ్చు.. నేను తిడితే మీ తలకాయలు పగుల్తయ్’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించ లేని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు మామ చాటు అల్లుడని అన్నారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకని చెప్పారు. వీళ్లిద్దరూ తన కాలిగోటికీ సరిపోరని అన్నారు. తాను నీతి నిజాయితీ ఉన్న నాయకుడినని, కేటీఆర్, హరీశ్ తనలా మాస్ లీడర్ కాలేరని అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన నాయకుడిని తాను అని అన్నారు. బచ్చగాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఉద్యమకారుడిని రాజకీయంగా చంపి కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పారు. నల్లగొండలో కేటీఆర్ నిర్వహించిన ఫెయిల్ అయ్యిందన్నారు. ఐదారు వేలకు మించి రాలేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.

