Home Page SliderInternational

అమెరికా బతుకమ్మ వేడుకలలో తెలంగాణ మంత్రి

అమెరికా వాషింగ్టన్ డీసీ లోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, వాషింగ్టన్ డీసీ చాప్ట‌ర్  ఆధ్వర్యంలో ద‌స‌రా, బతుకమ్మ వేడుకలు వైభ‌వంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీ పరిధి వ‌ర్జీనియాలోని అష్బర్న్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వ‌హించిన ఈ  మెగా ఈవెంట్ కు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా  మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలల ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. తమ సంస్కృతి, సాంప్రదాయాలు మరువకూడదని, భావిత‌రాల‌కు వారసత్వంగా అందించాలన్నారు. చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను మంత్రి ఈ సంద‌ర్బంగా గుర్తు చేసుకున్నారు.  తెలంగాణ ఉద్య‌మంలో ఎన్ఆర్ఐ లు అందించిన స‌హాకారం మ‌రువ‌లేనిద‌ని తెలిపారు.