బీఆర్ఎస్ పాలకుల వల్ల తెలంగాణాకి రూ.9వేల కోట్ల నష్టం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలకులపై మరోసారి మండిపడ్డారు. కాగా బీఆర్ఎస్ పాలనలో టెక్నాలజీ వర్కులు BHELకి కట్టబెట్టడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని సీఎం ఆరోపించారు. అయితే BHEL అనేది ఒక ఎలక్ట్రికల్ తమారీ సంస్థ అన్నారు. కాగా BHEL ఎప్పుడూ కూడా సివిల్ పనులు చేపట్టలేదు. అయితే ఆ సంస్థతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందన్నారు.దీంతో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ కారణంగా రూ.9వేల కోట్ల వరకు సర్కారుకు నష్టం జరిగిందని సీఎం వెల్లడించారు.అయితే దీనికి ఎవరు బాధ్యులో చెప్పాలని బీఆర్ఎస్ పాలకులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

