తెలంగాణాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అదేంటంటే రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..ఆరోగ్య&కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగ మేళ కొనసాగుతుందన్నారు. అయితే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో పోస్టులు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ పోస్టులకు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు అభ్యర్థులకు సూచించారు.