దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉంది…రాహుల్ గాంధీ
భారతదేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా రాహుల్ నేడు భూపాల పల్లిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పలు చెరిగారు. ఇక్కడ అధ్వానమైన అవినీతి ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణను చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవినీతి కారణంగా ప్రజలు చాలా తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అంతేకాక దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం మొత్తం కుల గణన చేపడతామని భరోసా ఇచ్చారు.