సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురు
అప్పులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన కేసుకు సంబంధించి లుకౌట్ నోటీసులను రద్దు చేయాలంటూ మాజీ ఎంపీ సుజనా చౌదరి, విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. బెస్ట్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (BCEPL) కంపెనీ 6 వేల కోట్ల మోసానికి సంబంధించి, 2017లో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. అదే కేసులో సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసింది. తాజాగా ఆ నోటీసులను రద్దు చేయాలని కోరడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐతే విదేశాలకు వెళ్లాలనుకునేటప్పుడు కింది కోర్టు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ 14 నుంచి 45 రోజులపాటు దుబాయ్, లండన్, సింగపూర్ వెళ్లేందుకు కోరిన అనుమతిని మత్రం కోర్టు మన్నించింది. సుజనా చౌదరికి సంబంధించిన అనేక సూట్ కేస్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాయనే ఆరోపణలు చాన్నాళ్ల నుంచి విన్పిస్తూనే ఉన్నాయి.


