Telanganatelangana,Trending Today

ఈరోజే తెలంగాణ గ్రూప్ 3 రిజల్ట్స్

తెలంగాణాలో గ్రూప్-3 పరీక్షలు గత ఏడాది 2024 నవంబర్ 17 & 18 తేదీలలో జరిగాయి. కాగా వాటి ఫలితాలు నేడు TGPSC రిలీజ్ చెయ్యనున్నారు. ఇప్పటికే గ్రూప్-1 మరియు గ్రూప్-2 ఫలితాలు రిలీజ్ కాగా గ్రూప్-3 కి సంభందించిన ఫలితాలు నేడు రిలీజ్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. రాష్ట్రంలో 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పరీక్షలకు 50.24 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు.