లోక్ సభ బరిలో తమిళిసై, గవర్నర్ గిరికి రాజీనామా
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ సైతం రాసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక సమాచారం రావాల్సి ఉంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తిరనల్వేలి నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో రాజ్ భవన్ లో ప్రధాని నరేంద్రమోదీ బస సందర్భంగా ఎన్నికల్లో పోటీ విషయమై ఆమె చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధాని నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆమె రాజీనామాకు సిద్ధపడ్డారు. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ … రాజీనామా చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 2019 వరకు తమిళనాడు బీజేపీ చీఫ్‌గా ఉన్న సౌందరరాజన్ 2019 సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుత కిరణ్ బేడీని తొలగించిన తర్వాత ఆమెకు పుదుచ్చేరి ఎల్‌జీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.