Home Page SliderTelangana

డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం..డిప్యూటీ సీఎం

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం డ్రగ్స్ మాఫియాపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. నేడు హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో జలవిహార్ వద్ద డ్రగ్స్ నిర్మూలన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ అనంతర కార్యక్రమంలో మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం విషప్రయోగం లాంటిది. కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుంది. డ్రగ్స్ మాఫియా చేతుల్లో సంఘ విద్రోహశక్తుల చేతులలో యువత జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొందరు అక్రమసంపాదన కోసం డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. డ్రగ్స్ నిర్మూలన కోసం నార్కోటిక్ బ్యూరోకు ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తాం. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కాకుండా ప్రజల నుండి సహకారం కూడా కావాలి. తాత్కాలిక సంతోషాలకు విద్యార్థులు బలి కావొద్దు. కుటుంబంతో పాటు సమాజం మొత్తం బాధపడాల్సి ఉంటుంది. అని ఆయన పేర్కొన్నారు.