Home Page SliderTelangana

  పెండింగ్ బిల్లుల విషయంలో తెలంగాణా సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు

తెలంగాణా ప్రభుత్వ పెండింగ్ బిల్లులు గవర్నర్ పాస్ చేయట్లేదని, నెలల తరబడి పెండింగులో పడిపోయాయని గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ రోజు వాదోపవాదనలు జరిగాయి. గవర్నర్‌కు నోటీసులు ఇవ్వడం కుదరదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ రాజ్యాంగ బద్దమైన అధికారి అనీ, వారికి ఇలాంటి నోటీసులు ఇవ్వలేమని , సుప్రీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు రాష్ట్రబిల్లులను పెండింగ్‌లో పెట్టడానికి గానీ, అవసరమైతే నిలిపివేయడానికి గానీ అధికారం ఉందని తెలియజేశారు. రాష్ట్రప్రభుత్వ వాదన ప్రకారం చాలా ముఖ్యమైన అనేక బిల్లులతో పాటు కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లు కూడా సెప్టెంబరు 2022 నుండి గవర్నర్ వద్ద పెండింగులో ఉన్నాయి. ఈ బిల్లులకు ఆమోదం ఇవ్వడంలో గవర్నర్ జాప్యంపై కేంద్రప్రభుత్వ స్పందనను కోరింది  సుప్రీంకోర్టు. అనంతరం వారం రోజులు ఈ విచారణను వాయిదా వేసారు.