తెలంగాణ కాబోయే సీఎం ఈటల-ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు ఒకటే చర్చ. తెలంగాణలో బీసీ సీఎం అజెండాతో ముందుకెళ్తున్న బీజేపీ, అందుకు పార్టీలోని అగ్రనేతలు ఎవరు సీఎం స్థాయికి సరిపోతారా అన్నదానిపై ఒక క్లారిటీకి వచ్చినట్టుగా కన్పిస్తోంది. ప్రధాని నరేంద్ర మో హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడన్న భావన బీసీల్లో వ్యక్తమవుతోంది. బీసీ ఆత్మగౌరవ సభలో తెలంగాణలో బీజేపీ బీసీలకు పట్టం కట్టబోతుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు, ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బీజేపీ నిర్ణయంపై తెలంగాణ బహుజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళీ అగ్రవర్ణాల ఆధిపత్యంతో నలగాలి అన్న ఫీలింగ్ చాలామందిలో కలుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో ఈటల రాజేందర్ బీసీల ఐకాన్‌గా గుర్తింపు పొందారు. కేసీఆర్ అరాచకాలకు, దాష్టీకాలకు దెబ్బతిన్న పులిలా ఉన్న ఈటల ఇప్పుడు తెలంగాణలో బడుగుల రాజ్యం కోసం ఒక వేదిక సిద్ధం చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ సూచనలు, సలహాలతో తెలంగాణలో వచ్చే రోజుల్లో బీసీయే సీఎంను చేసే లక్ష్యం కోసం పనిచేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈటల రాజేందర్‌ను సీఎం చేస్తామని, సాక్షాత్తూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభ అనంతరం ప్రధాని మోదీ బీజేపీ నేతలకు స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ లాంటి నాయకుడు పార్టీకి గౌరవమని కితాబిచ్చారు. తాజాగా ఈటల రాజేందర్ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ 36 కులాల ప్రతినిధులతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారని ఈటల గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోగానీ, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గానీ బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాలేదన్న విషయాన్ని ఈటల గుర్తు చేస్తున్నారు. దీనిపై ప్రధాని మోడీ కూడా క్లారిటీ ఇచ్చారన్న వర్షన్ విన్పిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యం, పలు శాఖలకు మంత్రిగా చేసిన అనుభవం… ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం, అన్నీ పరిశీలించాకే ప్రధాని మోడీ ఈటలను సీఎం అభ్యర్థిగా ఆమోదించారన్న అభిప్రాయం కలుగుతోంది. సీఎం అభ్యర్థి విషయంలో, భిన్నాభిప్రాయాలుగానీ, అంతర్గత విభేదాలు కానీ లేవన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం బీసీ సీఎం కోసం పార్టీ యంత్రాంగమంతా పనిచేస్తోందంటూ తేల్చి చెబుతున్నారు. బీసీలంతే బీజేపీ వైపు ఉన్నారు ఎంపీ లక్ష్మణ్ సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గెలిస్తే మచ్చలేని బీసీ నేతను సీఎం చేస్తామంటూ తాజాగా ఎంపీ బండి సంజయ్ సైతం వ్యాఖ్యానించారు.

మొత్తంగా ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన సీట్లను గెలుచుకుంటే సీఎం రేసులో ఈటల ముందుంటారన్నదానిపై మాత్రం క్లారిటీ వస్తోంది. తాజాగా ఈటల రాజేందర్ అటు హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో ఈటల నామినేషన్ సందర్భంగా 40 వేల మంది కార్యకర్తలు హాజరై ఆశీర్వదించడం కూడా మామూలు విషయం కాదు. ఈటలకు అభినందనలు తెలపడంతోపాటు, కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రావడం విశేషం. ఈటల హుజురాబాద్ నామినేషన్ సందర్భంగా కేంద్రమంత్రి జితేందర్ సింగ్ రావడం కూడా సంచలనం కలిగిస్తోంది. మంత్రిగా ఉన్న జితేందర్ సింగ్ ఈటల నామినేషన్‌కు రావడం, తాను రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ… ప్రధాన నరేంద్ర మోడీ ఆదేశాలతో ఈటల నామినేషన్ వేడుకలో పాల్గొనేందుకు వచ్చానని చెప్పారు.

తెలంగాణలో పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపీ ఈటలను సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేస్తుందని కోవాల్సి ఉంటుంది. మొన్నటి వరకు బీజేపీ చీఫ్‌గా వ్యవహరించిన బండి సంజయ్ సైతం వచ్చే ఎన్నికల్లో విజయం చేకూర్చేలా పనిచేస్తే తెలంగాణలో బీసీ సీఎం రాబోతున్నారంటూ తేల్చి చెబుతున్నారు. నిఖార్సయిన తెలంగాణ బిడ్డ రాజేందర్‌ను ఎన్నికల్లో బీసీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడం వల్ల… ఆయా వర్గాల్లో ప్రజలు బీజేపీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది.

