Home Page SliderTelangana

సాయంత్రానికి లేదంటే రేపటిలోగా ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు

తెలంగాణ ఎంసెట్ ఫలితాల తర్వాత సీట్ల కేటాయింపుపై అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ముందుగా అనుకున్నదానికంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు రెండ్రోజులు అధికారులు అవకాశమిచ్చారు. పలు విభాగాల్లో సీట్లు పెరిగాయన్న సూచనలతో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను సైతం మార్చుకున్నారు. భారీగా విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. 17వ తారీఖు నాటికి 93,167 మంది విద్యార్థులు ఆప్షన్లిచ్చారు. 58 లక్షల 59 వేల 254 ఆప్షన్స్ ఇవ్వగా, ఒక విద్యార్థి అత్యధికంగా 1025 ఆప్షన్స్‌ను సైతం ఇచ్చాడు. ఈ విషయాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కన్వీనర్ శ్రీదేవ సేన ప్రకటన ద్వారా తెలిపారు.

అయితే తుది వివరాలు తెలియాల్సి ఉంది. 96 వేల మంది విద్యార్థులు ఆప్షన్లిచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో 72,741 సీట్లుండగా, కంప్యూటర్, కంప్యూటర్ ఆధారం (CSE) కోర్సుల్లో సీట్లు సుమారు 50 వేల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. మెరుగైన కాలేజీలు, మెరుగైన బ్రాంచ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేకుండా అర్ధరాత్రికైనా సరే కాలేజీల వివరాలను https://eapcet.tsche.ac.in/TSEAPCET/Admission.aspx వైబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలా కాకున్నా రేపు ఉదయానికల్లా కేటాయింపు సమాచారం అందుతుంది. కన్వీనర్ సెంటర్ నుంచి మేసెజ్ లేదంటే మెయిల్ కూడా వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ అభ్యర్థులకు కాలేజీల ఎలాట్మెంట్‌ ఖరారు కానుంది.