తెలంగాణా ఎంసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణాలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.ఈ ఫలితాలను తెలంగాణా విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కాగా తెలంగాణాలో ఎంసెట్ అగ్రికల్చర్,మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు మే 10,11 తేదిల్లో నిర్వహించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు మే 12 నుంచి 15 వరకు ఆరు విడతల్లో నిర్వహించారు. అయితే ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది,అగ్రికల్చర్ పరీక్షలకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఇంజనీరింగ్ ఎంసెట్ విభాగంలో 80% విద్యార్థులు పాసయ్యినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అగ్రికల్చర్ ,ఫార్మాలో 86% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో అమ్మాయిలు 82%,అభ్బాయిలు 79%పాసయ్యారు. అయితే అగ్రికల్చర్‌లో అబ్బాయిలు 84%,అమ్మాయిలు 87% పాసయినట్లు మంత్రి సబితా వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో 1,56,879 మంది అగ్రికల్చర్,ఫార్మాలో 91,935 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి సబితా పేర్కొన్నారు. కాగా వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ తేదిలు, కౌన్సిలింగ్ సెంటర్ల వివరాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు.