Andhra PradeshHome Page Slider

తెలంగాణ ఎలక్షన్స్‌: బీ ఫారం అంటే ఏమిటో మీకు తెలుసా..?

ఎన్నికల సమయంలో సాధారణంగా ‘ఎ’ ఫారం, ‘బి’ ఫారం అంటూ వింటుంటాం. ఇదేమిటనేది చాలామందికి తెలియదు.

‘ఎ’-ఫారం…

తమ పార్టీ అభ్యర్థికి ఎవరినైతే ఎంపికచేసి ‘బి’ ఫారం అందించనున్నరో ఆ ‘బి’ ఫారం అందించే వ్యక్తికి ఇచ్చేదే ‘ఎ’ ఫారం. పార్టీ ఎవరినైతే ఎంపిక చేసి ‘ఎ’ ఫారం అందిస్తుందో ఆయనకు మాత్రమే తమ పార్టీ అభ్యర్థులకు ‘బి’ ఫారం అందించే అధికారం ఉంటుంది. ‘ఎ’ ఫారం అందుకున్న పార్టీ ప్రతినిధి ముందుగా తనకు లభించిన ‘ఎ’ ఫారాన్ని ఆయా ఎన్నికల అధికారులకు అందజేస్తారు.

‘బి’ ఫారం…

గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులు వీరే అంటూ పార్టీ ప్రతినిధి ఇచ్చేది ‘బి’ ఫారం. నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. ఆ పార్టీ అధ్యక్షులు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ ఫారాన్ని అందజేస్తారు.