Home Page SliderTelangana

రోడ్డుపై బైఠాయించిన తెలంగాణా విద్యాశాఖ మంత్రి

ఇటీవల కాలంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణాలోని బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు హైదరాబాద్ మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనల్లో తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కాగా ఆమె ఈ ఆందోళనల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి దాన్ని ఎత్తివేసి 3 గంటలు కరెంటు ఇస్తామనడం సిగ్గుచేటన్నారు.