Home Page SliderTelanganatelangana,

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ విద్యాశాఖ ఉపాధ్యాయుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల వివరాలను, ఫోటోలను వారు పనిచేస్తున్న స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. నకిలీ టీచర్లు, ఫేక్ అటెండెన్స్ మోసాలు అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. దీనివల్ల తనిఖీ అధికారులకు, ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా టీచర్ల వివరాలు తెలుస్తాయని పేర్కొంది. అయితే డిజిటల్ అటెండెన్స్ పెట్టొచ్చని, కానీ ఫోటోలు పెట్టడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు.