Home Page SliderTelangana

తెలంగాణలో ముగిసిన స్లైడింగ్ ఆప్షన్స్ ప్రక్రియ

ఇంజినీరింగ్ విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో కాలేజీల ఇష్టానుసారం ఉన్న వ్యవస్థను ప్రస్తుతం ప్రభుత్వం మార్చుతోంది. విద్యార్థులకు నష్టం కలక్కుండా ఉండేలా, తల్లిదండ్రులకు బర్డెన్ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఓవైపు కాలేజీలకు సీట్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వడంతో కోర్ సబ్జెక్టులు తీసుకునేవారు కరువైన పరిస్థితి. ఇలాంటి తరుణంలో విద్యార్థులందరూ కూడా కంప్యూటర్ సబ్జెక్టులపై ఫోకస్ పెడుతుండటంతో పెద్ పెద్ద కాలేజీల్లో మాత్రమే కోర్ సబ్జెక్టులకు గిరాకీ ఏర్పడింది. అయితే తాజాగా పలువురు విద్యార్థులు కంప్యూటర్ సీట్లను సైతం వదిలి, ఐఐటీ, ఎన్ఐటీలో చేరడంతో ఆయా కాలేజీల్లో సీట్లను పొందిన అత్యధిక ర్యాంక్ ఉన్న విద్యార్థులకు కూడా ఈసారి కంప్యూటర్ సీట్లు లభించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్లైడింగ్ ప్రక్రియ పూర్తి కాగా, త్వరలో స్పాట్ కౌన్సిలింగ్ సైతం కన్వీనర్ ఆధ్వర్యంలో జరిగే అవకాశం కన్పిస్తోంది. మొత్తంగా ఇన్నాళ్లూ కాలేజీలు ఆడింది ఆట పాడింది పాటలా ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వస్తున్నట్టు కన్పిస్తోంది.