తెలంగాణ అప్పులు రూ. 4 లక్షల 33 వేల కోట్లు
రాష్ట్రం ఏర్పాటప్పుడు అప్పులు రూ. 75 వేల కోట్లు..
నేడు అప్పులు రూ. 4 లక్షల 33 వేల కోట్లు
తెలంగాణ అప్పుకు సంబంధించి లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ అప్పులు భారీగా పెరిగినట్టు తాజా లెక్కలతో తేలింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వంతోపాటుగా, ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పుల వివరాలను కేంద్రం పార్లమెంట్‌లో వెల్లడించింది. తెలంగాణ ఏర్పడినప్పుడు అప్పులు కేవలం రూ. 75,577 కోట్లని పేర్కొంది. 2021-22 నాటికి అప్పులు ఏకంగా రూ. 2,83,452 కోట్లకు పెరిగాయంది. ప్రభుత్వరంగ సంస్థలకు, కార్పొరేషన్లకు లక్షన్నర కోట్లు, 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు తీసుకున్న అప్పులు లక్షా 30 వేల కోట్లని కేంద్ర మంత్రి పంజక్ చౌదరి పేర్కొన్నారు.


