తెలంగాణా బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం ప్రారంభమైన కేబినెట్ సమావేశం తాజాగా ముగిసింది. కాగా అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ భేటి జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్, కొండా సురేఖ, పొంగులేటి హాజరయ్యారు. కాగా ఈ భేటీలో తెలంగాణా కేబినెట్ సభ్యులు రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. కాగా మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.అయితే బడ్జెట్ సందర్భంగా ప్రతిపక్షనేత కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి హాజరుకానున్నారు.ఈసారి తెలంగాణా బడ్జెట్ రూ.2.97లక్షల కోట్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా రేవంత్ సర్కార్ రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ రూపొందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ మేరకు తెలంగాణా బడ్జెట్‌లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.