Home Page SliderTelangana

మార్చిలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఆర్థికశాఖ వివిధ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకోనుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వం ఇవాల్టి నుంచి ప్రత్యేకంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ముఖ్య కార్యద ర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల మంత్రులు, అధికారులతో భేటీ కానున్నారు. ఇవాళ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, రేపు మధ్యాహ్నం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సంబంధింత అధికారులు సన్నాహక సమావేశానికి హాజరవుతారు.