Home Page SliderTelangana

తెలంగాణ బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు

తెలంగాణ బడ్జెట్ రూ. 2,90, 396 కోట్లు. రెవిన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూలధన వ్యయం రూ. 37,525 కోట్లు. ఈ ఏడాది పన్నేతర ఆదాయం రూ. 22, 808 కోట్లని, గ్రాంట్ల అంచనా రూ. 41,259 కోట్లుగా పేర్కొన్నారు. వ్యవసాయానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు. నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు, విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు. ఆసరా పింఛన్ల కోసం రూ. 12 వేల కోట్లు, దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు కేటాయించారు. ఎస్సీ ప్రత్యేక నిధికి రూ. 36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధికి రూ. 15,233 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు కేటాయించారు. మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు, అటవీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు కేటాయించారు.