Home Page SliderTelangana

ఈటలకు, అర్వింద్‌కు హై సెక్యూరిటీ –బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు

తమ ప్రాణాలకు ముప్పు ఉందనే అనుమానం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రప్రభుత్వం హై సెక్యూరిటీ కల్పించింది. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను కేటాయించింది. అంతేకాక, ఈటలకు వై ప్లస్ కేటగిరీలో, అర్వింద్‌కు వై కేటగిరీ ప్రకారం భద్రత కల్పించింది. సీఆర్‌పీఎఫ్ బలగాలను  వీరి భద్రత కోసం కేటాయించారు. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి 20 కోట్ల రూపాయల సుపారీతో బేరం కుదుర్చుకున్నడని, ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు. దీనితో కేంద్ర హోం శాఖ అప్రమత్తమయ్యింది. ఈటల రాజేందర్ భద్రత కట్టుదిట్టం చేయమని ఆదేశాలు జారీ చేసింది.

అలాగే ధర్మపురి అర్వింద్ ఇంటిపై కూడా బీజేపీ ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడి చేశారని, దీనిపై ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీనితో ఈ ఇద్దరి విజ్ఞప్తులను పరిగణించిన కేంద్ర హోంశాఖ భావించింది. దీనితో వీరికి సెక్యూరిటీ ఇస్తున్నారు. సీఆర్‌పీఎఫ్ అధికారులు వారి ఇళ్లను పరిశీలించి వారికి సెక్యూరిటీ ఇవ్వనున్నారు. 8 మంది సీఆర్‌పీఎఫ్ కమాండోలు వై కేటగిరీ సెక్యూరిటీతో ధర్మపురి అర్వింద్‌కు, 11 మంది సీఆర్‌పీఎఫ్ కమాండోలు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించబోతున్నారు. అలాగే వీరిద్దరికీ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు కేటాయించారు. కేంద్ర మంత్రితో సమానమైన భద్రత ఈటలకు లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసినా తన భద్రత గురించి పట్టించుకోలేదని ఈటల బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అందుకే కేంద్రం తనకు భద్రత కేటాయించిందన్నారు.