Home Page SliderTelangana

రేపు తెలంగాణ బంద్

రేపు తెలంగాణ రాష్ర్ట వ్యాప్త బంద్ ఉండనుంది. ఈ మేరకు రేపు తెలంగాణ బంద్ కు తుడుం దెబ్బ పిలుపు నిచ్చింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ లో ఆదివాసి మహిళపై హత్యాచారయత్నం కు పాల్పడిన వ్యక్తి పై చర్యలకు డిమాండ్ చేస్తూ.. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ కు తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని బంద్ కు పిలుపునిచ్చింది ఆదివాసీ హక్కుల పోరాట సమితి. అన్ని వర్గాల ప్రజలు, విద్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని సహకరించాలని వారు కోరారు. అదేవిధంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ముందస్తు అరెస్ట్ లకు పాల్పడుతున్నారు.