తెహల్కా తరుణ్ తేజ్‌పాల్‌కు 2 కోట్ల జరిమానా
తెహల్కా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఢిల్లీ హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. ఆయన 2001లో ప్రచురించిన వార్తా కథనం వల్ల పరువు నష్టం కేసులో మేజర్ జనరల్ అహ్లూవాలియాకు 2 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. రక్షణ రంగానికి సంబంధించిన కొనుగోలు ఒప్పందంలో అహ్లూవాలియా మధ్యవర్తిగా వ్యవహరించి అవినీతికి పాల్పడ్డాడంటూ తెహల్కా పత్రిక ప్రచురించిన కథనంపై అహ్లూవాలియా 2002లో పరువు నష్టం కేసును వేశారు. ఈ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం వల్ల ఆయన ప్రతిష్ట దారుణంగా దెబ్బతినిందని, ఏమాత్రం ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేసినందువల్ల ఆయన అనుభవించిన వేదనను నయం చేయలేమని హైకోర్టు పేర్కొంది.