Home Page SliderTelangana

మాజీ మంత్రులను కలిసిన తీన్మార్ మల్లన్న

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను కలిశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన కోరారు. బీసీ నేతలతో కలిసి వారికి మెమొరాండం అందించారు. అలాగే బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాలని తీన్మార్ మల్లన్న కోరారు.